Homeసినిమా2021 Top Item Songs in Telugu

2021 Top Item Songs in Telugu

2021 Top Item Songs in Telugu

2021 Top Item Songs in Telugu – సినిమా అంటే యాక్షన్‌, రొమాంటిక్‌, కామెడీ సీన్లు, పాటలు వంటి రకారకాల వినోదాల మేళవింపు.

ఒక పక్కా కమర్షియల్‌ సినిమా అంటే అ‍న్నీ ఉండి తీరాల్సిందే.

ఆకలితో ఉన్నవాడికి విందు భోజనంలా వడ్డించాలి సినిమా దర్శకుడు.

అప్పుడే ప్రేక్షకులు సినిమా అనే రుచిని ఆస్వాదిస్తారు. లేకుంటే తిరస్కరిస్తారు.

ఇక మాంచి కమర్షియల్ సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ అంటే ప్రతీ మాస్‌ ప్రేక్షకుడు స్పెషల్‌ ఫోకస్‌ పెడతాడు సినిమాపై.

సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ లేదంటే పెదవి విరుస్తారు ఆడియెన్స్‌.

Krithi Shetty : ఆ సీన్స్ చేయడం తప్పు అనిపించలేదు

Malavika Sharma : సోషల్​మీడియాలో తగ్గేదేలే అంటుందిగా..

థియేటర్లలో స్పెషల్‌ సాంగ్ వచ్చిందంటే చాలు విజిల్స్‌, పేపర్స్‌ విసిరేస్తూ గోల గోలగా సందడి చేస్తారు.

ఇంతలా కేక పెట్టించే ఐటమ్‌ సాంగ్‌లో ఎవరూ స్టెప్పులేస్తారా అని వేయి కళ్లతో ఎదురుచూసే పక్కా మాస్‌ ఆడియెన్స్‌ కూడా ఉన్నారు.

అందుకే ఈ ఐటమ్‌ సాంగ్స్‌లో తమ అందాలతో కట్టిపడేస్తున్నారు హీరోయిన్స్‌.

ఇదివరకు అయితే ఈ సాంగ్స్‌లో సాధారణ నటీనమణులు నర్తించేవారు.

ఇప్పుడు ట్రెండ్ మారింది. అందుకే తమ ముందు ఐటమ్‌ సాంగ్స్‌ కూడా తక్కువే అని నేరుగా హీరోయిన్లే ఎంట్రీ ఇస్తున్నారు.

తాజాగా స్టార్‌ హీరోయిన్‌ సమంత చేసిన ‘ఊ అంటావ మావ’తో ఐటమ్‌ సాంగ్స్‌కు కొత్త కళ వచ్చింది.

ఇలా ఈ ఏడాది వచ్చిన ‘భూమ్‌ బద్దలు’ నుంచి ‘ఊ అంటావా మావ’ వరకు అలరించిన స్పెషల్ సాంగ్స్‌పై ఓ లుక్కేద్దాం.

1. ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ (పుష్ప)

Samantha Ruth Prabhu : అందుకు మరింత కష్టపడ్డా..

2. ఛాంగురే ఐటమ్‌ సాంగురే (గల్లీ రౌడీ)

3. పెప్సీ ఆంటీ (సిటీమార్‌)

4. మందులోడా (శ్రీదేవి సోడా సెంటర్‌)

5. పైన పటారం (చావు కబురు చల్లగా)

6. రంభ ఊర్వశి మేనక (అల్లుడు అదుర్స్‌)

7. డించక్‌ డించక్‌ డింకా (రెడ్‌)

8. భూమ్ బద్దలు (క్రాక్‌)

ఈ స్పెషల్‌ సాంగ్స్‌తో పాటు నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ సినిమాలోని ‘దిగు దిగు నాగ’ సాంగ్‌ కూడా చాలా అలరించింది.

అయితే ఈ పాటలో కూడా హీరోయిన్‌ రీతు వర్మ నర్తించింది.

Recent

- Advertisment -spot_img