యూరప్‌లోని ఎస్టోనియాకు చెందిన 48 ఏళ్ల మార్క్ సోసన్ ఆస్ట్రేలియాకు చెందిన 104 ఏళ్ల ఎల్ఫ్రిడా రీట్‌తో ప్రేమలో పడ్డాడు. అయితే ఈ విలక్షణమైన ప్రేమ కథకు ఇటీవల ఎండ్ కార్డ్ పడింది. శనివారం ఆమె మరణించడంతో మార్క్ భావోద్వేగానికి గురయ్యాడు. న్యాయవాది అయిన మార్క్ ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు తొలి చూపులోనే ఆమెను చూసి ప్రేమలో పడ్డాడట.