ఇదే నిజం, మనూర్ : వీధి కుక్కల దాడిలో 60 గొర్రె పిల్లలు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలంలోని బెల్లాపూర్ గ్రామంలో జరిగింది. గ్రామ శివారులోని దత్తాత్రేయ మఠం దగ్గర ఉన్న గొర్రె పిల్లలపై మంగళవారం రాత్రి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన రాజు, శీను, సుధాకర్, మరికొందరికి చెందిన గొర్రె పిల్లలు మేపుతూ బెల్లాపూర్ వెళ్లారు. కాపలా ఎవరు లేని సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేశాయి. తక్షణ సాయం కింద ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.