Small Farmers : దేశంలో వ్యవసాయ కుటుంబాల్లో 90 శాతం చిన్న రైతులే…
Small Farmers : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మొత్తంగా 17 కోట్ల 24 లక్షల 43 వేల కుటుంబాలు ఉన్నాయి.
వీటిలో 54 శాతం వ్యవసాయ కుటుంబాలు (9 కోట్ల 30 లక్షల 94 వేలు) ఉంటే.. 46 శాతం వ్యవసాయేతర కుటుంబాలు (7 కోట్ల 93 లక్షల 50 వేలు) ఉన్నాయి.
మొత్తం 9.31 కోట్ల వ్యవసాయ కుటుంబాలు ఉండగా.. వాటిలో ప్రతి 10 కుటుంబాల్లో దాదాపు 9 కుటుంబాలకు ఉన్న భూమి 2 హెక్టార్లకన్నా తక్కువే.
అలాగే.. ప్రతి మూడు వ్యవసాయ కుటుంబాల్లో రెండు కుటుంబాలకు గల భూమి 1 హెక్టారుకన్నా తక్కువగానే ఉంది.