ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) వార్నింగ్ ఇచ్చింది.
మరో రెండు వారాల్లోగా ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 20 కోట్ల కోవిడ్ పాజిటివ్ ( Covid Positive ) కేసులు నమోదు అవుతాయని డబ్ల్యూహెచ్వో డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ గెబ్రియేసస్ ( Tedros Adhanom Ghebreyesus ) తెలిపారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వారమే దాదాపు 40 లక్షల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న తీరును పరిశీలిస్తుంటే, ఆ సంఖ్య మరో రెండు వారాల్లో 20 కోట్లు దాటే ప్రమాదం ఉందని టెడ్రోస్ తెలిపారు.
ఇది మా అంచనాల ప్రకారమే తక్కువే అని కూడా ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే.