HomeజాతీయంAgain Petrol Diesel Prices Rise Soon : సామాన్యుడిపై మళ్లీ పెట్రోభారం.. పెరగనున్న ధరలు!

Again Petrol Diesel Prices Rise Soon : సామాన్యుడిపై మళ్లీ పెట్రోభారం.. పెరగనున్న ధరలు!

Again Petrol Diesel Prices Rise Soon : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Diesel Price) భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

పెట్రో మోతతో(Petrol Diesel Price) అల్లాడిపోతున్న సామాన్యుడికి మరోసారి​ ధరల భారం తప్పేలా లేదు!

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగనున్న నేపథ్యంలో.. భారత్​లో పెట్రోల్​, డీజిల్​ రిటైల్ ధరలు(Petrol Diesel Price) భారీగా పెరగనున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇప్పటికే.. చమురు సంస్థలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటుండటం వల్ల ధరల పెంపు తప్పదని తెలుస్తోంది.

గత 12 రోజులుగా భారత్​లో పెట్రోల్​, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.

కానీ, ఇప్పుడు అంతర్జాతీయ ధరలు పెరుగునున్న నేపథ్యంలో ఈ ధరల్లో మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి.

ఆగస్టు నెలతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఈ నెలలో బ్యారెల్​కు 4 నుంచి 6 డాలర్ల వరకు పెరిగాయి.

అయితే.. ఇప్పటివరకైతే చమురు సంస్థలపై ఈ ప్రభావం పడకపోవడం గమనార్హం.

అంతర్జాతీయంగా పెట్రో ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ఆయిల్​ మార్కెటింగ్​ సంస్థలు… రిటైల్ పెట్రోల్, ధరలు పెంచనున్నట్లు తెలుస్తోంది.

దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు జులై 17, జులై 15న చివరిసారిగా పెరిగాయి.

ప్రస్తుతం దిల్లీలో లీటర్​ పెట్రోల్ దర రూ.101.19గా కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.88.62 పైసలు వద్ద ఉంది.

Recent

- Advertisment -spot_img