Tamanna die hard Child fan cry for seeing as a villain : మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరీర్లో భయపెట్టించే పాత్రలు పెద్దగా చేయలేదు.
నితిన్ నటించిన మాస్ట్రోలో నెగెటివ్ షేడ్ పోషించి చిన్న పిల్లలతో పాటు పెద్ద వాళ్లను భయపెట్టించింది.
చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. తమన్నాని ఇంత వైల్డ్‌గా చూడలేకపోయిన చిన్నారి ఏడ్చేసింది.
దర్శకుడు గాంధీ చిన్న కూతురు లిపి.. తమన్నాకు పెద్ద ఫ్యాన్ కాగా, ఆమె సినిమాలో తమన్నాని వైల్డ్‌గా చూడలేకపోయింది.
వరుస హత్యలు చేస్తుండడం చూసి కన్నీరు పెట్టుకుంది. ఈ క్రమంలో నితిన్ తన ట్విట్టర్లో చిన్నారి వీడియోని షేర్ చేస్తూ.. వాట్ యా, నీ అభిమానిని ఏడిపించావ్.
ఈ రోజు నేను చూసి క్యూట్ వీడియో ఇది. గాంధీ(దర్శకుడు) చిన్న కూతురు లిపి.. నీకు పెద్ద అభిమాని’’ అని నితిన్ పేర్కొన్నాడు.
చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావు అంటే.. గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు.
ఎందుకు అందర్నీ చంపుతుంది?’’ అంటూ ఏడ్చేసింది. ఇంట్లో వాళ్లు అది సినిమా అంటూ నచ్చజెప్పారు.
ఈ చిన్నారి వీడియోపై స్పందించిన తమన్నా.. ఆలస్యం చేయకుండా చిన్నారికి తప్పకుండా హగ్ ఇవ్వాల్సిందే’’ అని తెలిపింది.
కాగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన మాస్ట్రో చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
నితిన్, తమన్నాల నటనకు అంతా ఫిదా అవుతున్నారు.
బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన ‘అంధదూన్’ సినిమాను తెలుగులో ‘మాస్ట్రో’గా తెరకెక్కించిన సంగతి తెలిసింది.