GPay and PhonePe Payments without Internet : ఇంటర్నెట్ లేకుండా పేమెంట్స్ చేయడం ఎలా.. COVID-19 వ్యాప్తితో ప్రజలు ఇంటి లోపల మాత్రమే ఉండవలసి వచ్చింది.
చాలా మంది తమ యొక్క ఆఫీసు కార్యకలాపాలను కూడా ఇంటి వద్దనే సాధారణ స్థితికి మార్చుకోవలసి వచ్చింది.
తరువాతి కొనసాగిన లాక్‌డౌన్‌లు ప్రతిఒక్కరిని దాదాపు అన్నింటి కోసం ఇంటర్నెట్‌కు అతుక్కుపోయేలా చేయగా ప్రజలు సున్నితమైన లావాదేవీల కోసం డిజిటల్ బ్యాంకింగ్‌కి మారడానికి అధిక మందిని ప్రోత్సహించారు.
నెట్ బ్యాంకింగ్
నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కొన్నేళ్లుగా ఉన్నప్పటికీ UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సింగిల్ విండో మరింత ఉపయోగకరంగా అందుబాటులోకి వచ్చింది.
కానీ UPI ద్వారా పేమెంట్స్ చేయడానికి లేదా డబ్బును స్వీకరించడానికి ఒక యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
కాబట్టి మీరు మీ డేటా ప్లాన్ అయిపోయినట్లయితే మరియు అత్యవసరంగా డబ్బు పంపాల్సిన అవసరం వస్తే కనుక NUUP లేదా నేషనల్ యూనిఫైడ్ USSD ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించి చేయవచ్చు.
NUUP ఎలా..
NUUP లేదా ‘*99#’ సర్వీసును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నవంబర్ 2012 లో ప్రవేశపెట్టింది.
దాని ప్రారంభ సమయంలో సర్వీస్ పరిమిత పరిధిని కలిగి ఉంది.
ఇందులో కేవలం BSNL మరియు MTNL రెండు TSPలు మాత్రమే సర్వీసును అందించాయి.
ఇది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా యూపిఐ లావాదేవీలు చేయడానికి వినియోగదారులను ఎనేబుల్ చేస్తుంది.
ఒకవేళ మీరు ఇంటర్నెట్ లేకుండా కూడా UPI చెల్లింపులను ఎలా చేయాలో అని ఆలోచిస్తున్నట్లయితే కింద ఉన్న దశల వారీ మార్గదర్శిని అనుసరించండి.
GPay, PhonePe, Paytm ఆఫ్‌లైన్ లావాదేవీలు: ఇంటర్నెట్ లేకుండా UPI పేమెంట్స్ చేసే విధానం
స్టెప్ 1- ముందుగా మీ ఫోన్‌లో డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి (*99#) టైప్ చేయండి.
స్టెప్ 2- తరువాత మీరు కొత్త మెనూకు నావిగేట్ చేయబడతారు.
ఇందులో డబ్బు పంపండి, డబ్బు అందుకోండి, బ్యాలెన్స్ తనిఖీ చేయండి, నా ప్రొఫైల్, పెండింగ్ అభ్యర్థనలు, లావాదేవీలు మరియు UPI పిన్ వంటి ఏడు ఎంపికలు కనిపిస్తాయి.
స్టెప్ 3- డబ్బు పంపడానికి మీ డయల్ ప్యాడ్‌పై నంబర్ 1 నొక్కండి.
ఇది మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, UPI ID లేదా మీ అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ ఉపయోగించి డబ్బు పంపడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
స్టెప్ 4- ఒకవేళ మీరు UPI ID ఎంపికను ఎంచుకుంటే కనుక మీరు గ్రహీత యొక్క UPI ID ని నమోదు చేయాలి.
స్టెప్ 5- తర్వాత మీరు గ్రహీతకు బదిలీ చేయదలిచిన మొత్తాన్ని నమోదు చేసి ఆపై మీ UPI పిన్ నంబర్‌ను ఉంచండి.
స్టెప్ 6- ‘పంపించు’ ఎంపికను నొక్కండి మరియు లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు నిర్ధారణ వస్తుంది.
విజయవంతమైన లావాదేవీ తరువాత మీరు భవిష్యత్తులో లావాదేవీల కోసం ఈ గ్రహీతని లబ్ధిదారుడిగా సేవ్ చేయాలనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతారు.
ఈ సర్వీస్ రూ.0.50 ఛార్జ్ ఫీజుతో వస్తుంది.