Eatala Rajender comments on government spending money on huzurabad by election : ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు..
ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.
బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ మాట్లాడారు.
పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారందరూ టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి కేసిఆర్‌ను గెలిపించాలని చెబుతున్నారని, ఇవన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి, ఆయన సొంత భూమి అమ్మి, కూలీ పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.
ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు, పథకాలు ఇస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ కేవలం కాపాలాదారుడు మాత్రమే అన్నారు.
ఈటల రాజేందర్‌కు కారు డ్రైవర్, వంట మనిషి, వడ్డించడానికి మనిషి కూడా ఉండకుండా చేస్తామని శపథం చేస్తున్నారన్నారు.
తనతో ఉండే వాళ్లందరినా తీసుకు వెళ్తున్నారని, ప్రజలే తనకు అండగా ఉన్నారని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా భరించే శక్తి తనకు ఉందన్నారు.
ఇక్కడ డబ్బులు తనను ఓడించడానికే ఇస్తున్నారని, ప్రజల మీద ప్రేమతో కాదని రాజేందర్ తెలిపారు.
బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నా: ఈటల రాజేందర్
దుర్మార్గానికి ఘోరీ కట్టడం దగ్గరలో ఉంది: ఈటల