Homeఆంధ్రప్రదేశ్Reservations : మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిగ్​ షాక్‌..?

Reservations : మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిగ్​ షాక్‌..?

Reservations : మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు బిగ్​ షాక్‌..?

Reservations : గత కొన్ని దశాబ్దాలుగా క్రిస్టియన్ల సంఖ్య పెరుగుతోందని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

అసలు జన్మతహ క్రిస్టియన్లు చాలా తక్కువగా ఉంటున్నారని.. కానీ.. చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు క్రిస్టియన్లుగా మారుతున్నారన్నది హిందూ సంస్థల ఆరోపణ.

దాందేముంది.. అందులో తప్పేముంది అనుకుంటున్నారా.. అవును తప్పేమీ లేదు.

కానీ.. అలా క్రిస్టియన్లుగా మతం మారిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు తమ రిజర్వేషన్లను మాత్రం వదలుకోవడం లేదని హిందూ సంస్థలు వాదిస్తున్నాయి.

ఫారిన్​లో​ ‘చీప్‌’గా ఎంబీబీఎస్‌ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..

ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..

క్రిస్టియానిటీలో కులం లేదు.. అందువల్ల ఇతర మతాల్లోకి వెళ్లిన హిందువులు తమ రిజర్వేషన్ల హక్కును కోల్పోతారు.. ఇది రాజ్యాంగం చెబుతున్న విషయమే.

అయితే.. చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు తాము మతం మారినా.. హిందూ మతాన్ని వదిలిపెట్టినా.. ఆ విషయాన్ని అధికారికంగా అంగీకరించరు.

వారు తమ రికార్డుల్లో హిందువులుగానే రికార్డయి ఉంటారు. తమ రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉంటారు.

కానీ.. వాస్తవానికి వారు క్రిస్టియన్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పడు దీన్ని హిందూ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.

అయితే.. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు క్రిస్టియానిటీకి మారినా దాన్ని రుజువు చేయడం ఎలా.. ఇప్పుడు ఇదే చిక్కుప్రశ్న.. దీనికి హిందూ సంస్థలు ఓ మార్గం కనిపెట్టాయి.

దేశంలో రైతు కుటుంబ సగటు భూమి ఎంతో తెలుసా

వ్యవసాయ కుటుంబాల్లో ఓబీసీలే అధికం..

ఎలాగూ ఇప్పుడు క్రిస్‌మస్‌ రాబోతోంది.. క్రిస్మస్‌కు క్రిస్టియన్‌ గా భావించే అంతా క్రిస్మస్‌ స్టార్‌ను ఇంటి పైన పెట్టుకుంటారు.

ఇది క్రైస్తవ సంప్రదాయం.. ఇప్పుడు ఈ క్రిస్మస్‌ స్టార్ పెట్టుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కుటుంబాలన్నీ మతం మారినట్టేనని హిందూ సంస్థలు అంటున్నారు.

తాము అలాంటి వారిని గుర్తించి.. ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని చెబుతున్నాయి.

ప్రభుత్వానికి ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు కాబట్టి.. ఈసారి తామే రంగంలోకి దిగుతామని హిందూపరివార్ సంస్థలు అంటున్నాయి.

క్రిస్మస్‌ స్టార్‌ ఉన్న ఇళ్లను గుర్తించేందుకు ఏపీ-తెలంగాణలో 34,800 మంది హిందూ సైనికులను నియమించినట్టు తెలుస్తోంది.

హిందూ పరివార్ సంస్థల కార్యకర్తలు, ఏబీవీపీ, ఇతర సంస్థలు కూడా రంగంలోకి దిగుతాయట.

Recent

- Advertisment -spot_img