KCR Survey On MLAs : ఎమ్మెల్యేలపై కేసీఆర్ సర్వే.. వారికి టెన్షన్ టెన్షన్..
KCR Survey On MLAs : తెలంగాణలో బీజేపీ రాజకీయంగా బలపడుతున్నట్టు కనిపిస్తుండటంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
కష్టపడితే తెలంగాణలో తమకు అధికారం వస్తుందనే నమ్మకంతో ఉన్న బీజేపీ పెద్దలు..
ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేశారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తరువాత కూడా టీఆర్ఎస్ నాయకత్వం కూడా బీజేపీని సీరియస్‌గా తీసుకుందని.. ఆ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తున్న తీరును బట్టి క్లియర్‌గా అర్థమవుతోంది.
ఇక తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ కూడా వేగంగా పావులు కదుపుతున్నారు.
Micro plastics in Drinking Water : మీరు తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్..
Compensation : తన కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం
గతానికి భిన్నంగా కొన్ని రోజుల వ్యవధిలోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు.
వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం, బీజేపీని టార్గెట్ చేస్తూ నిరసనలు చేపట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇటీవల జరిగిన పార్టీ నేతల సమావేశంలో సీఎం కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
నేతలు ప్రజలకు దగ్గరగా ఉండాలని.. కొందరు నేతలు తమ తీరు మార్చుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం.
దీంతో సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారేమో అనే చర్చ పార్టీ ఎమ్మెల్యేల్లో మొదలైందట.
సాధారణంగా సీఎం కేసీఆర్ పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తుంటారు.
దీనిపై ఆయన ఇంటలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకుంటారనే ప్రచారం ఉంది.
Anand Mahindra : తుక్కుతో వాహనం.. ఎక్చ్సేంజీలో బొలెరో ఆఫర్
Dog Saved Baby : తల్లి వదిలేసిన శిశువుకు తల్లిగా మారిన శునకం.. తన పిల్లలతో పాటే ఉంచుకుని..
తాజాగా ఇదే అంశంపై ఆయన కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. ఎమ్మెల్యేల పనితీరు బాగాలేకపోతే అక్కడ విపక్షాలు,
ముఖ్యంగా బీజేపీ బలపడే అవకాశం ఉంటుందనే భావనలో గులాబీ బాస్ ఉన్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.
అందుకే గతానికి భిన్నంగా ఈసారి సిట్టింగ్‌లలో చాలామంది సీఎం కేసీఆర్ పనితీరు మార్చుకునే అంశంపై గట్టిగా చెప్పారనే చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపీ బలపడకుండా ఉండాలంటే.. ఆ పార్టీపై రాజకీయంగా పోరాటం చేయడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపర్చుకోవడం కూడా ముఖ్యమనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉందని తెలుస్తోంది.
Baba Vanga Predictions : 2022 లో గ్రహాంతరవాసులు భూమిపై దండయాత్ర చేయబోతున్నారా
50 Years For 2650 Crores : 50 ఏండ్లు పోరాడి 2.6 వేల కోట్లు సాదించారు
అందుకే సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గతంకంటే చాలా సీరియస్‌గా తీసుకున్నారని.. కొందరు ఎమ్మెల్యేలతో ఆయన నేరుగా మాట్లాడే అవకాశాలు లేకపోలేదని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మొత్తానికి తెలంగాణలో బీజేపీకి చెక్ పెట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్న సీఎం కేసీఆర్.. ఈ క్రమంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గట్టిగానే క్లాస్ తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.