Raashi Khanna : మెయిన్ విలన్‌గా రాశీఖన్నా..?
Raashi Khanna : టాలీవుడ్ భామ రాశీఖన్నా (Raashi Khanna) ఓటీటీ ప్రాజెక్టు రుద్రతో డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
మార్చి 4న హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా రాశీఖన్నా (Ajay Devgan) మీడియాతో చిట్ చాట్ చేసింది.
ఈ షోలో ఎలా అవకాశం వచ్చిందని అడుగా..గ్లామరస్ పాత్రలున్న దక్షిణాది సినిమాల్లో నటించారు.
మొదట ఈ పాత్ర కోసం మరో నటిని ఆడిషన్ చేశారు.
కానీ మేకర్స్ అంతగా నచ్చలేదు.
ఆ తర్వాత నన్నడిగితే రుద్ర (Rudra) సినిమాకోసం ఆడిషన్‌కు వెళ్లగా..రోల్‌కు ఎంపికయ్యానని చెప్పుకొచ్చింది.
మీ రోల్ గురించి చెప్పమనగా..ఈ చిత్రంలో అలియా చోక్సీ అనే సోషియోపతి డాక్టర్ పాత్రలో నటించా.
ఆమెకు చాలా ఈగో ఉంటుంది. ఎవరితో అంత సులభంగా కలవదు.
ఇతరులకు సమస్యలు సృష్టిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
నేను మొదటిసారి ఇప్పటివరకు చేయనట్వంటి ప్రాజెక్టు చేస్తున్నా.
కఠినమైన భావోద్వేగాలతో మిలితమైన డార్క్ క్యారెక్టర్ నాది అని చెప్పింది.
ఈ మూవీలో మీరే మెయిన్ విలనా అని ప్రశ్నించగా..? ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇదే ప్రశ్న అడుతున్నారు.
ఈ చిత్రంలో చాలా మంది విలన్లున్నాయి. నేను వారిలో ఒకరా..? అనేది రుద్ర చూసి గుర్తించండని ప్రేక్షకులకు సూచించింది.
అజయ్ దేవ్గన్ కూడా ఈ ప్రాజెక్టుతో ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఆయన షూటింగ్ మొదటి రోజు నుంచి ఛిల్ అవుతూ నన్ను సపోర్టు చేశారని చెప్పుకొచ్చింది.
రాశీఖన్నా తెలుగులో మారుతి డైరెక్షన్లో గోపీచంద్ హీరోగా నటిస్తోన్న పక్కా కమర్షియల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.