Homeవిచిత్రంMeat bone in throat : అదృష్టం అడ్డం తిరిగింది.. గొంతులో పూలుగు బొక్క ఇరుక్కుని

Meat bone in throat : అదృష్టం అడ్డం తిరిగింది.. గొంతులో పూలుగు బొక్క ఇరుక్కుని

Meat bone in throat : అదృష్టం అడ్డం తిరిగింది.. గొంతులో పూలుగు బొక్క ఇరుక్కుని

Meat bone in throat : “అదృష్టం అడ్డం తిరిగితే.. అరటిపండు తిన్నా పళ్లు విరుగుతాయంటా..!” వేదం సినిమాలో అల్లుఅర్జున్​ చెప్పే డైలాగ్ ఇది.

అచ్చంగా అలాంటి మాటలే ఓ వ్యక్తి జీవితంలో నిజమయ్యాయి.

అయితే ఇక్కడ అరటి పండుకు బదులు మటన్​ తిన్నాడు.

పళ్లు విరగటానికి బదులు.. ఏకంగా ప్రాణాలేపోయాయి. అసలేంజరిగిందంటే..

సూర్యాపేట జిల్లాలోని రాజానాయక్​ తండాకు చెందిన భూక్య గోపి కుటుంబానికి ఇంటి దైవం ముత్యాలమ్మ.

ఈనెల 12(మంగళవారం)న ముత్యాలమ్మకు కుటుంబమంతా కలిసి పండుగ చేశారు.

అమ్మవారికి మేకను బలిచ్చి ఘనంగా వేడుక చేశారు.

యాట మాంసాన్ని రుచికరంగా వండి.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు.

అనంతరం అందరూ సహ పంక్తిగా కూర్చొని సంతోషంగా భోజనాలు చేస్తున్నారు.

మసాలాల ఘుమఘుమలతో జిహ్వ లాగేస్తున్న మటన్​లో మంచిమంచి ముక్కలు తింటూ.. రుచిని ఆస్వాదిస్తున్నారు.

ఇంతలో.. భూక్య గోపి గొంతులో అనుకోకుండా మాంసం బొక్క ఇరుక్కుంది.

అటు లోపలికి వెళ్లట్లేదు.. ఇటు బయటికి రావట్లేదు.

North Korea : ఉత్తర కొరియాను సందర్శించి రావడం భారతీయులకు సాధ్యమేనా..?

Non-Veg Brahmins : దేశంలో కొన్ని చోట్ల‌ బ్రాహ్మణులు చేపల్ని ఎప్ప‌టినుంచో తింటున్నారు.. ఎందుక‌లా..

ఊపిరి ఆడనివ్వట్లేదు. తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.

ఏదీ ఫలితమివ్వలేదు. ఉన్నాకొద్ది పరిస్థితి చేజారిపోతోంది. మనిషి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

అక్కడ కూడా వైద్యులు శాయశక్తులా ప్రయత్నించారు. అయినా ఫలితం దక్కలేదు.

చికిత్స పొందుతుండగానే గోపి ఊపిరి ఆగిపోయింది.

చిన్న మాంసపు బొక్క ఓ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసి.. చివరికి ఆయువునే తీసేసింది.

అంతవరకు ఎంతో సంతోషంగా పండుగ చేసుకున్న కుటుంబం.. గోపి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయింది.

అంత్యక్రియల కార్యక్రమాల అనంతరం గోపి పెద్ద కొడుకు భూక్య సురేశ్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Medical shop : బ్రాండ్ వేరు కానీ మందు అదే అని మెడికల్ షాప్ వాళ్ళు మందులు ఇస్తే.. మ‌నం చూడాల్సింది ఏమిటి?

Payment Apps : గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌లు డబ్బు ఎలా సంపాదిస్తాయి?

Recent

- Advertisment -spot_img