Toll Free Route : టోల్ గేట్స్ లేని ‘ఫ్రీ రూట్స్’ కావాలా..?
Google Maps new Feature Toll Free Route : టోల్ రుసుం చెల్లించకుండానే సుదూర ప్రయాణాలు చేసేందుకు గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
దేశంలోని 2000 రోడ్డు మార్గాల వివరాలను యూజర్లకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Google Maps Toll Price : సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు టోల్ ఫీజు చాలా సార్లు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయాణ ఖర్చలకు ఇది అదనపు భారంగా మారుతుంది. టోల్ ప్లాజా లేని ప్రత్యామ్నాయ మార్గాలు చాలా మందికి తెలియదు.
దీంతో తప్పక టోల్ ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి.
దీన్ని దృష్టిలో పెట్టుకునే గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది.
కొత్త అప్డేట్లో టోల్ ఫీజు చెల్లించాల్సిన రూట్లు, ఎన్నిసార్లు ఎంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది వంటి వివరాలను వినియోగదారులకు ముందుగానే తెలియజేస్తుంది.
వారు చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత ఈ వివరాలను చూపిస్తుంది.
అంతే కాదు ఏఏ టోల్ ప్లాజ్ వద్ద ఏ రోజు ఎంత ఫీజు చెల్లించాలి? పేమెంట్ చెల్లించేందుకు యూపీఐ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు సదుపాయం ఉందా? వంటి వివరాలను కూడా ఇకపై గూగుల్ మ్యాప్స్‌లో చూడవచ్చు.
Commercial Crops : వ్యవసాయంతో 3 నెలల్లో 3 లక్షలు సంపాదించే అవకాశం
Couple Age Gap : ఎందుకు భార్య కంటే భర్త వయస్సు ఎక్కువ ఉండాలి..
భారత్‌లోని 2000 రోడ్డు మార్గాలు సహా అమెరికా, జపాన్, ఇండోనేషియాలో టోల్ ఫీజుల వివరాలను కొత్త అప్డేట్లో చేర్చుతున్నట్లు గూగుల్ తెలిపింది.
రానున్న రోజుల్లో మరిన్ని దేశాలను ఈ జాబితాలో చేర్చనున్నట్లు బుధవారం ప్రకటన ద్వారా తెలియజేసింది.
Google Maps Update : ఒకవేళ యూజర్లు టోల్ ఫీజు చెల్లించొద్దనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా మ్యాప్స్‌లో చూపించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ఈ నెల నుంచే టోల్ రుసుంకు సంబంధించిన వివరాలు ఆందుబాటులో ఉంటాయి.
గూగుల్ మ్యాప్స్ డైరెక్షన్స్‌లో టాప్ రైట్ కార్నర్లో ఉన్న మూడు డాట్ల ట్యాప్ చేస్తే.. టోల్ ఫీజు లేని మార్గాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ కూడా యూజర్లకు ఉంటుంది.
Google Maps Toll Free Route : గూగుల్ మ్యాప్స్‌ను సులభంగా ఉపయోగించేలా యాపిల్ వాచ్, ఐఫోన్ యూజర్లకు కొత్త అప్డేట్లను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు గూగుల్ తెలిపింది.
ఇందులో ట్రిప్ విడ్జెట్స్, డైరెక్ట్ నావిగేషన్‌తో పాటు సిరి, షార్ట్‌కట్ యాప్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఇంటిగ్రేట్ చేయడం వంటి సదుపాయాలు ఉన్నట్లు పేర్కొంది.
అంతేకాదు యాపిల్ వాచ్ యూజర్లు త్వరలోనే గూగుల్ మ్యాప్స్ నుంచి నేరుగా డెరెక్షన్స్ పొందవచ్చని చెప్పింది.
MBBS in Abroad : ఫారిన్లో ‘చీప్’గా ఎంబీబీఎస్ చేస్తారా.. అయితే మీరు బొక్కబోర్లా పడ్డట్టే..
Passport without Broker : బ్రోకర్ లేకుండా రూ.1500 లకే పాస్‌పోర్ట్ ఎలా..