Cervical cancer vaccine : గర్బాశయ కాన్సర్ కు దేశీయ టీకాఅందుబాటులోకి రానుంది. ఈ. విషయాన్ని సిరమ్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా సీఈఓ అదర్ పూలవాలా వెల్లడించారు. సామాన్యులకు అందుబాటులో మార్కెట్లో దీని. ధర రూ.200 నుంచి 400 ఉండనుంది. విదేశీ టీకాలు ఉన్నప్పటికీ దేశీయంగా మొట్టమొదటి టీకా ఇది.
మొదటి దశలో 20 కోట్ల డోసులు
మొదటి దశలో 20 కోట్ల డోసులు అందుబాటులోకి తెస్తామని సీఈఓ పూనావాలా వెల్లడించారు. దేశీయ. అవసరాలు తీరాకే విదేశాలకు ఎగుమతి చేస్తామని అన్నారు. ప్రస్తుతం లభిస్తున్న టీకా లతో పోలిస్తే దీని ధర తక్కువగా ఉంటుందని, ఈ. ఏడాది చివరి వరకు అందుబాటులోకి తెచ్చే ఈ. టీకా ధరను ప్రభుత్వంతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. దేశంలో వెలుగు చూస్తున్న కాన్సర్ లలో cervical cancer రెండో స్థానం లో ఉంది.