Khusbu:తాజాగా ఖుష్బూ తను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖుష్బూకు ఎనిమిదేండ్ల వయసున్నప్పుడు తన తండ్రి చేత లైంగిక వేదింపులకు గురిచేసినట్లు తెలిపింది. ఆ విషయంలో తనను గాయపరిచి, చిత్ర హింసలకు గురిచేసినట్లు తెలిపింది. విమెన్స్ డే ని పురస్కరించుకొని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఖుష్బూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘అబ్బాయైనా, అమ్మాయైనా చిన్నతనం నుంచి వేదింపులకు గురైతే అది వాళ్ల మొత్త జీవితంపై ప్రభావం చూపిస్తుంది. భార్యను చిత్రహింసలు పెట్టి, కన్న కూతిరిపై లైంగిక వేదింపులు జరపడాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి జీవితం నాశనం అయింది. నాపై జరిగిన వేధిపులు అమ్మకు చెప్తే నమ్ముతుందో లేదోనని భయపడ్డా. ఎందుకంటే.. ఎన్ని తప్పులు చేసినా తన భర్త దేవుడని నమ్మే మనస్తత్వం మన ఆడవాళ్లకు ఉంటుంది కదా. 15 ఏండ్ల నుంచి ఆయనకు ఎదురతిరగడం మొదలుపెట్టా. నా పదహారేండ్లప్పుడు ఆయన మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఆ టైంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నాం’ అంటూ ఖుష్బు వివరించారు.చిత్ర పరిశ్రమలో నటీమనులపై జరిగిన లైంగిక వేదింపుల గురించి ఒక్కొక్కరు బయట పెడ్తున్నారు.