HomeతెలంగాణHanmakonda: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది?-...

Hanmakonda: రాష్ట్రంలో కాంగ్రెస్ ఎక్కడుంది?- బండి సంజయ్

Hanmakonda:రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,ఎంపీ బండి సంజయ్ అన్నారు .ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎస్వీ కన్వెన్షన్ హాలులో జరిగిన సన్నాహక సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలిసి బండి సంజయ్ మాట్లాడారు.కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిది. కేసీఆర్ ద్రుష్టిలో ఆ పార్టీ అంటేనే షాపింగ్ మాల్ లాంటింది. ఇప్పుడు ఆ పార్టీలో మరో కాస్ట్ లీ మెటీరియల్ వచ్చి చేరింది. కేసీఆర్ దగ్గర డబ్బులకు కొదవలేదు. ఎంత డబ్బైనా పెట్టి కాంగ్రెస్ ను కొనేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారు. అందుకే బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్-కాంగ్రెస్ లు పార్లమెంట్ లోపల, బయట కలిసే పనిచేస్తున్నయన్నారు ఒంటరిగా బీజేపీని ఓడించడం చేతగాకే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తూ తమను అప్రదిష్టపాల్జేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు

బీఆర్ఎస్ గడీల పాలనను అంతమొందించి రామరాజ్య స్థాపనే బీజేపీ ఏకైక లక్ష్యం. అందుకోసం పేదల పక్షాన పోరాడుతున్నం. ప్రజలు సైతం బీజేపీనే ఆదరిస్తున్నారు. బీజేపీకే అధికారం ఇవ్వాలని భావిస్తున్నారు. నిన్నగాక మొన్న రాష్ట్ర ఇంటెలిజెన్స్ రిపోర్టులోనూ బీజేపీకే మొగ్గు రావడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో సభ పేరుతో నెల రోజుల నుండి అష్టకష్టాలు పడుతూ చెమటోడుస్తోంది. ఆ పార్టీ నిర్వహించేది పాదయాత్ర ముగింపు సభనా? జాయిన్సింగ్స్ సభనో అర్ధం కానట్లుగా ఉంది. ఎవరికి వారే గొడవలతో నిమగ్నమయ్యారన్నారు. బీజేపీకి త్యాగాల చరిత్ర ఉంది. కార్యకర్తలెందరో జైలు పాలయ్యారు. సామ జగన్మోహన్ రెడ్డి వంటి వారు ప్రాణాలనే త్యాగం చేసిన చరిత్ర ఓరుగల్లుకు ఉందదన్నారు . ఇంతటి పవిత్రమైన గడ్డకు ప్రపంచమే ‘‘ది బాస్ ’’ అంటూ కీర్తించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాబోతున్న నేపథ్యంలో ఆయనకు కనీవినీ ఎరగని రీతిలో ఘన స్వాగతం పలికి చరిత్ర స్రుష్టిద్దామన్నారు.

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే. దుబ్బాక నుండి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు బీఆర్ఎస్ పై పోటీ చేసి గెలిచింది బీజేపీయే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహా తోకపార్టీలన్ని కలిసి పోటీ చేసినా 48 స్థానాల్లో జెండా ఎగరేసిన పార్టీ బీజేపీయే. కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. రెండు స్థానాలకే పరిమితమైంది. దుబ్బాకసహా మునుగోడు ఎన్నికల వరకు ఆ పార్టీకి డిపాజిట్లే రాలేదు… మరి కాంగ్రెస్ యాడుంది? ఆ పార్టీని జాకీ పెట్టి లేపాలని చూస్తున్నారని విమర్శించారు .ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో జరిగే అభివ్రుద్ధి పనుల్లో పాల్గొనేందుకు హన్మకొండకు వస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించబోతున్నామన్నారు

Recent

- Advertisment -spot_img