HomeతెలంగాణShamshabad Airport:శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్​

Shamshabad Airport:శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో బాంబు ఉందంటూ మెయిల్​

– బాంబ్​ స్క్వాడ్​, డాగ్​ స్వ్కాడ్​ ముమ్మర తనిఖీలు
– తన కుమారుడు ఆడుకుంటూ అలా పెట్టాడని మరో మెయిల్​

ఇదేనిజం, హైదరాబాద్​: శంషాబాద్​ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు ఉందని.. సాయంత్రం 7 గంటలకు ఆ బాంబ్​ పేలుతుందని అగంతకుడి నుంచి కంట్రోల్​ రూమ్​ కు ఓ మెయిల్ వచ్చింది. మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు ఈ మెయిల్​ వచ్చింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. చివరకు బాంబు లేదని తేల్చారు. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు ఎయిర్‌పోర్టు మొత్తం తనిఖీలు నిర్వహించారు. ఎయిర్‌పోర్టులో దిగిన విమానాల లగేజీ, ప్యాసింజర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చివరకు ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు. తన కుమారుడు ఆడుకుంటూ అలా పెట్టాడని మరో మెయిల్ వచ్చింది. అయితే అక్కడికి కొద్దిసేపటికే మరో ఐడీతో ఎయిర్‌పోర్టు అధికారులకు ఇంకో మెయిల్‌ వచ్చింది. తప్పు జరిగిందని.. తన కుమారుడు ఫోన్‌తో ఆడుకుంటూ మెయిల్‌, సందేశాలు పెట్టాడని అజ్ఞాత వ్యక్తి అందులో పేర్కొన్నారు. తనను క్షమించాలంటూ కోరాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఫిర్యాదు చేశారు.

Recent

- Advertisment -spot_img