– మాజీ మంత్రి కడియం శ్రీహరి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : దళితబంధు కోసం ఎవరైనా లంచం అడిగినా, తీసుకున్నబట్టలు ఊడదీయిస్తానని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తలతో కడియం శ్రీహరి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు కోసం ఎవరైనా లంచం అడిగినా, తీసుకున్నా బట్టలు ఊడదీయిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధు, గృహలక్ష్మితో పాటు ఏ ప్రభుత్వ పథకంలో చేర్చడానికైనా లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులైనవారి నుంచి చాలామంది మధ్యవర్తులు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.