HomeసినిమాPawan Kalyan-Ajith combo wanted a multistarrer Pawan Kalyan-Ajith​ కాంబోలో మల్టీస్టారర్​ చేయాలనుంది

Pawan Kalyan-Ajith combo wanted a multistarrer Pawan Kalyan-Ajith​ కాంబోలో మల్టీస్టారర్​ చేయాలనుంది

టాలీవుడ్​లో పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​కు ఎలాంటి ఫ్యాన్​ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్​లోనూ తమిళ హీరో అజిత్​కు అదే రేంజ్​లో ఫ్యాన్స్​ ఉన్నారు. రియల్​ లైఫ్​లోనూ పవన్, అజిత్​ చాలా సింపుల్​గా ఉంటారు. అయితే పవన్– అజిత్ కాంబోలో ఓ మల్టీస్టారర్ తీయాలని ఉందంటూ డైరెక్టర్ ఎస్​ జే సూర్య తన మనుసులోని మాట బయటపెట్టాడు. తాను ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న ఎస్​జే సూర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి. తాను అజిత్​తో ఇప్పటి వరకు వర్క్ చేయలేదని.. ఒకవేళ ఆ అవకాశం వస్తే పవన్​–అజిత్ కాంబోలో సినిమా చేయాలని ఉందని ఎస్​జే సూర్య తెలిపాడు. ఈ మాసివ్ కాంబో నిజంగానే సెట్ అయితే రికార్డులు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని పవన్, అజిత్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img