Homeహైదరాబాద్latest Newsమెట్రో స్టేషన్​లో కుప్పకూలిన వ్యక్తి

మెట్రో స్టేషన్​లో కుప్పకూలిన వ్యక్తి

– సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన జవాన్

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: మెట్రో స్టేషన్​లో కుప్పకూలిన ఓ వ్యక్తికి జవాన్ సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన ఢిల్లీలోని నంగ్లోయ్‌ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. అనిల్‌ కుమార్‌(58) అనే వ్యక్తి మెట్రోస్టేషన్‌లో చెకింగ్‌ పాయింట్‌ దాటిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో అక్కడే డ్యూటీలో ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ ఉత్తమ్‌ కుమార్‌ సకాలంలో స్పందించి అతడికి కార్డియో పల్మనరీ రిససిటేషన్‌ (సీపీఆర్) అందించడం ద్వారా ప్రాణాల్ని నిలబెట్టారు. ఈ ప్రక్రియ చేసిన వెంటనే ఆ ప్రయాణికుడు స్పృహలోకి రాగా.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన తర్వాత సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30గంటల సమయంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ తన ట్విట్టర్ అకౌంట్​లో షేర్‌ చేసింది. అనిల్‌ కుమార్‌ అనే ప్రయాణికుడికి సీపీఆర్‌ అందించడం ద్వారా ఎంతో విలువైన ప్రాణాల్ని సిబ్బంది కాపాడారని, అతడు కృతజ్ఞతలు తెలిపారని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది.

Recent

- Advertisment -spot_img