– బీఆర్ఎస్ తరఫున నామినేషన్ పేపర్లపై సంతకం చేసిన కేటీఆర్
ఇదే నిజం, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను ఆయన సమర్పించారు. ప్రసాద్‌కుమార్ వెంట సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు ఉన్నారు. ప్రసాద్‌కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సంతకం చేశారు. గురువారం ఉదయం శాసనసభలో స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నారు.