సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న సిరిసిల్ల చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. దాదాపు 20వేలకు పైగా కార్మికులు ఈ రంగంపై ఆధారపడ్డారని.. వారు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన మార్కెట్ లేకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ALSO READ: BRSకు బిగ్ షాక్.. కాంగ్రెస్ లోకి చేరిన నలుగురు కీలక నేతలు
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికులకు బతుకమ్మ చీరలకు సంబంధించి రూ.220 కోట్ల మేర బకాయి పడిందన్నారు. ఈ డబ్బులు రాకపోవడంతో ఆర్ధికంకా నానా తంటాలు పడుతున్నారన్నారు. కార్మికులను దృష్టిలో పెట్టుకొని వారికి బకాయిలు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
ALSO READ: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయాలన్నారు. కార్మికులను ఓనర్లగా మార్చేందకు బీఆర్ఎస్ ప్రభుత్వం వర్కర్ టు ఓనర్ స్కీంను తీసుకువచ్చారని.. కానీ అది అమలుకు నోచుకోలేదని చెప్పారు. మీరు ఆ నిధులను కేటాయించి వర్కర్లను ఓనర్లుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని బండి సంజయ్ లేఖలో రాశారు.
ALSO READ: ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇళ్లు లేనివారికి రూ.5లక్షలు.. మరి ఇందులో మీరున్నారా..?