Homeలైఫ్‌స్టైల్‌ఆరోగ్య ప్ర‌ధాయ‌ని 'బొప్పాయి'

ఆరోగ్య ప్ర‌ధాయ‌ని ‘బొప్పాయి’

మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే మన దేశంలోకి ప్రవేశించింది.

మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు.

ముఖ్యంగా ఏపీలో కడప, తెలంగాణాలో ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.

బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట.

పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు.


విట‌మిన్ల ఖ‌జానా


బొప్పాయి పండులోవున్నన్ని విటమిన్లు మరెందులోను లేవంటారు వైద్యులు. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “సీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులోనున్నాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఉదర సంబంధమైన జబ్బులను మటుమాయం చేసే గుణం బొప్పాయిలో ఉన్నాయి.


పోష‌కాల గ‌ని

  • కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
  • బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
  • విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
  • బొప్పాయి ‘కాయ’ జీర్ణానికి తోడ్పడితే, ‘పండు’ పోషకాలనిస్తుంది.
  • బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.

100 గ్రాముల బొప్పాయిలో..

  • 40 క్యాలరీలు
  • 1.8గ్రా. పీచు
  • 24మి.గ్రా. కాల్షియం
  • 61.8 మి.గ్రా. విటమిన్‌-సి
  • విటమిన్‌ ఎ (6%)
  • బీటా కెరోటిన్‌ (3%)
  • విటమిన్‌ బి1 (3%)
  • బి2 (3%)
  • బి3 (2%)
  • బి6 (8%)
  • 9.8గ్రా కార్బోహైడ్రేట్లు
  • 0.6గ్రా ప్రోటీన్లుస‌
  • 10మి.గ్రా. మెగ్నీషియం
  • 257మి.గ్రా. పొటాషియం
  • 3 మి.గ్రా. సోడియం

కొలెస్ట్రాల్‌ అంటే కొవ్వు లేదు, క్యాలరీలూ తక్కువే. అందుకే స్థూలకాయులు సైతం హాయిగా బొప్పాయిని తినొచ్చు.

Recent

- Advertisment -spot_img