Homeహైదరాబాద్latest NewsLion తో Selfie .. ప్రాణాలు పోయినయి

Lion తో Selfie .. ప్రాణాలు పోయినయి

తిరుపతి జూపార్క్​ లో విషాదం చోటు చేసుకున్నది. సింహంతో సెల్ఫీ తీసుకుందామనుకున్న ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్​ కు చెందిన ప్రహ్లాద్​ గురువారం తిరుపతి జూ సందర్శనకు వెళ్లాడు. కాగా అతడు సెల్ఫీ తీసుకొనేందుకు సింహం ఎన్​ క్లోజర్​ లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సింహం ప్రహ్లాద్​ మీద దాడి చేసింది. ఈ దాడిలో ప్రహ్లాద్​ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే జూ అధికారుల నిర్లక్ష్యంపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రహ్లాద్ సింహం ఎన్​ క్లోజర్ లోకి వెళ్తుంటే జూ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రహ్లాద్​ ఆత్మహత్య చేసుకుందామన్న ఉద్దేశ్యంతోనే ఎన్ క్లోజర్​ లోకి వెళ్లి ఉంటాడని జూ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఈ ఘటన తిరుపతి నగరంలో తీవ్ర కలకలం రేపింది.

Recent

- Advertisment -spot_img