కుటుంబ కలహాల కారణంగా ఏడాది కుమారుడికి విషమిచ్చిన తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన నరేష్‌తో శ్రీజకు మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. అయితే భర్తతో గొడవల కారణంగా శ్రీజ కరీంనగర్ విజయపురి కాలనీలోని తన తల్లి ఇంట్లో ఉంటుంది. భర్తతో గొడవల కారణంగా మనస్తాపం చెందిన ఆమె ఏడాది బాబుకు విషమిచ్చి.. తానూ తాగి సూసైడ్ చేసుకుంది.
కుమారుడు అక్కడికక్కడే మరణించగా.. మృత్యువుతో పోరాడుతున్న శ్రీజను గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఇక కూతురు మృతితో మనస్థాపం చెందిన తల్లి జయప్రద కూడా విషగులికలు తిని సూసైడ్ అటెంప్ట్ చేసింది. ప్రస్తుతం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.