Homeహైదరాబాద్latest Newsవామ్మో.. లోన్ యాప్ ఎంత పని చేసింది.. అసలేం జరిగిందంటే..?

వామ్మో.. లోన్ యాప్ ఎంత పని చేసింది.. అసలేం జరిగిందంటే..?

లోన్ యాప్ సంస్థల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని అందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ (21) లోన్‌యాప్‌ ద్వారా రూ.30 వేల రేణం తీసుకున్నాడు. రూ.30 వేల రుణానికి గాను.. నాలుగు నెలల వ్యవధిలో శ్రీకాంత్ దాదాపు రూ.1,30,000 చెల్లించాడు. అయితే ఇంకా అదనంగా మరో రూ.80 వేలు చెల్లించాలంటూ శ్రీకాంత్‌పై లోన్‌యాప్ సిబ్బంది ఒత్తిడి తీసుకొచ్చారు. లోన్ యాప్ సిబ్బందికి డబ్బులు చెల్లించేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో రెచ్చిపోయిన లోన్‌యాప్ సిబ్బంది శ్రీకాంత్ పట్ల దురుసుగా ప్రవర్తించారు.

యువకుడిపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టి మరీ వేధించారు. దాంతో మనస్థాపానికి గురైన శ్రీకాంత్ మార్చి 30న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ శ్రీకాంత్ గత రాత్రి కన్నుమూశాడు. శ్రీకాంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లోన్‌యాప్ సిబ్బంది ఆగడాలను అరికట్టాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img