Homeహైదరాబాద్latest News'ట్రోలింగ్ స్టార్' టు 'ఐకాన్ స్టార్'

‘ట్రోలింగ్ స్టార్’ టు ‘ఐకాన్ స్టార్’

అల్లుఅర్జున్ 8 ఏప్రిల్ 1982 చెన్నైలో జ‌న్మించాడు. బన్నీకి రెండేళ్ళ అప్పుడే సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. చిరంజీవి హీరోగా 1985లో న‌టించిన ‘విజేత’ సినిమా షూటింగ్ చూడ‌డానికి వెళ్ళిన బ‌న్నీని, ద‌ర్శ‌కుడు కొదండ రామిరెడ్డి చూసి మంజుల కొడుకుగా న‌టింప‌చేశాడు. దాని త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్ మ‌న‌వ‌డిగా ‘స్వాతి ముత్యం’ సినిమాలో న‌టించాడు. చిరంజీవి ‘డాడీ’ సినిమాలో కూడా బ‌న్నీ గెస్ట్ రోల్‌లో న‌టించాడు.

2003 లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ సినిమాతో బన్నీ తన కెరీర్ ప్రారంభించారు. సినిమా హిట్ట‌యింది కాని అల్లుఅర్జున్‌ మాత్రం వీడు హీరో ఎంట్రా.. మెగా ఫ్యామిలీ నుంచి వ‌స్తే మాత్రానా హీరో అయిపోతాడా అంటూ విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ‘ఆర్య’ సినిమా కోసం సుకుమార్ తో జతకట్టిన బన్నీ ఇక కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు. అంతేకాకుండా విమ‌ర్శించిన వారే ఈ మూవీలో బ‌న్నీ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిపించారు. ఆపై ‘ట్రోలింగ్ స్టార్’ టు ‘ఐకాన్ స్టార్’ గా ఎదిగాడు. నేడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే.. ఇదేనిజం వెబ్ డెస్క్ తరపున అల్లు అర్జున్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Recent

- Advertisment -spot_img