ఇదే నిజం కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్.పి కే.సురేష్ కుమార్ ఐపిఎస్ గారు ఆసిఫాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖి చేశారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా పోలీస్ స్టేషన్ లో కేసులకు సంబంధించిన ఫైళ్లను, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. స్టేషన్లో సీసీటీఎన్ఎస్ లోని ఎఫ్ఐఆర్-చార్జిషీట్, మీసేవ, హెచ్ ఆర్ ఎం ఎస్ అన్ని అప్లికేషన్స్లను పరిశీలించారు. తదుపరి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఇందులో భాగంగా..పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాది దారులతో మర్యాదపుర్యకంగా ఉంటూ వారి యొక్క సమస్యలను ఓపికతో విని వాటిని పరిష్కరించాలని, ప్రజలకు మంచి సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో ఎంటర్ చేయాలని తెలియజేశారు. సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై, ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి ప్రతిఫలం దక్కుతుందని తెలియజేశారు.అదేవిదంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచాలని తెలిపారు.
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, ఎలక్షన్స్ కు సంబంధించి తగు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నియమావళి రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా పక్కా అమలు చేయాలని సూచించారు. నిషేధిత మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. గంజాయి మొక్కలను పెంచిన, స్వీకరించిన, రవాణా చేసిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. సైబర్ బాధితులకు సైబర్ వారియర్స్ ద్వారా వీలైనంత త్వరగా వారికి న్యాయం జరిగేలా సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ గారు సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్పోస్ట్ నందు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తతో విధులను నిర్వర్తించాలని సూచించారు. నేర దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞాణoను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, పోలిస్ స్టేషన్ పరిధిలో గస్తీ వాహనాలను నిరంతరం గస్తీలో తిప్పాలని, బీట్లు మరియు పెట్రోలింగ్ సక్రమంగా నిర్వహించాలని అన్నారు. స్టేషన్ రికార్డులను, పరిసరాలను, శుభ్రంగా ఉంచాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క విధి విధానాల గురించి సూచించే 5 ఎస్ విధానం ను పోలీస్ స్టేషన్ లో అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ సి.ఐ సతీష్, ఎస్.ఐ ప్రవీణ్, మరియు సిబ్బంది పాల్గొన్నారు.