మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిక్కుల్లో పడింది. మహారాష్ట్ర సైబర్ విభాగం తమన్నాకు సమన్లు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను ఫెయిర్‌ప్లే యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకుగాను ఈ నెల 29న విచారణకు రావాలంటూ నోటీసులలో తెలియజేశారు. అయితే తమన్నా చేసిన పని వల్ల కోట్లలో నష్టం వాటిల్లిందని ప్రసార హక్కులను పొందిన వయాకామ్ తమ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు తమన్నాను ఈ నెల 29న విచారణకు హాజరుకావాలని మహారాష్ట్ర సైబర్ విభాగం కోరింది. అయితే గత ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లను ఫెయిర్ ప్లే యాప్ అక్రమంగా ప్రసారం చేసిందని వయాకామ్ ఆరోపించింది. దీంతో ఇందుకు సంబంధించి తమన్నాను సైబర్ సెల్ ప్రశ్నించనుందని తెలుస్తుంది.