హైదరాబాద్ మహానగరంలో భారీ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్ 71లోని నవనిర్మాణ్ నగర్‌లో బాబ్జీ భాగవతుల అనే రిటైర్డ్ ఉద్యోగి నివాసం ఉంటున్నాడు. తమ ఇంట్లో రూ. కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయని జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్ మీదే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.