ఖమ్మం జిల్లా: పోలీసుల కళ్లుగప్పి నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్తకొత్త మార్గాల్ని ఎంచు కుంటున్నారు లీడర్లు. అలాంటి చావు తెలివి తేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు. అది కూడా పుష్ప మూవీ తరహాలో. కానీ, పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు. ఖమ్మంలో తనిఖీలు నిర్వ హిస్తున్న పోలీసులకు.. 15 లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు. ముందు పోలీసులకు అనుమానమే రాలేదు. కానీ, కొంచెం తేడాగా ఉండటంతో అతడ్ని తనిఖీ చేశారు. అంతే, కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ముందు, ప్యాంట్ జేబుల్లో నుంచి నోట్ల కట్టల్ని బయ టికి తీశాడు. ఆ తర్వాత షర్ట్ విప్పిస్తే… మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది కూడా బనియన్‌లో. సంచి తరహాలో బనియ న్‌ను కుట్టించుకుని… అందు లో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడు. బనియన్ నిండా నోట్ల కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు. లక్షో…రెండు లక్షలో కాదు… ఏకంగా 15లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ప్రధాన రహదారు ల్లో చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకట గిరి చెక్‌పోస్ట్ వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు. ఇంతలో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు. వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు. దీంతో 15 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఇతగాడి తెలివి తేటలు చూసి పోలీస్ లు ఆశ్చర్యానికి గురయ్యా రు..