మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తున్నాయి. 2007లో మొదలైన ఈ పొట్టి కప్ సమరంలో భారత్ తొలి విజేతగా నిలిచింది. సీనియర్లు లేకుండా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో వెళ్లిన యువ టీమిండియా ఛాంపియన్‌గా నిలిచింది. అయితే ధోనీ కెప్టెన్సీ, ఫైనల్లో గౌతమ్ గంభీర్ స్పెషల్ ఇన్నింగ్స్, ఇర్ఫాన్ పఠాన్ అద్భుత బౌలింగ్, యువరాజ్ సింగ్ సంచలన ఆటతీరుతో టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడానికి కారణమని చెప్పొచ్చు. అయితే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడానికి ప్రధాన కారణం రోహిత్ శర్మ అని గంభీర్ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ ఇన్నింగ్స్ విజయంలో కీలకపాత్ర పోషించిందని అన్నాడు. హిట్ మ్యాన్ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.