అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆర్య”. 2004 మే 7న విడుదలైన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. నేటితో ఆర్య 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ఈ చిత్ర హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజు హాజరు కానున్నారు. అయితే దిల్ రాజు ది ఫ్యామిలీ స్టోర్ ప్రమోషన్స్‌లోనే అలాంటి రీ-యూనియన్‌ని నిర్వహిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నేడు హైదరాబాద్ పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్ మీట్ అని కాకుండా రీ యూనియన్ అనవచ్చు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అనురాధ మెహతా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో శివ బాలాజీ కీలక పాత్రలో నటించారు.