మూవీ ఈవెంట్లు అనగానే నటీమణులు మోడ్రన్ డ్రెస్సుల్లో దర్శనమిస్తూ అందర్నీ ఆకట్టుకుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ న్యూయార్క్ లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె సబ్యసాచి చీర దరించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో సంప్రదాయ చీరకట్టులో అలియా అద్భుతంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.