రాజస్థాన్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చింది ఓ తల్లి. జోధ్‌పూర్‌కు చెందిన తుల్చా కన్వర్ అనే 28 ఏళ్ల మహిళ ఒకే ప్రసవంలో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఇవాళ ఉదయం ఆమెకు కటి నొప్పి రావడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు సిజేరియన్ ద్వారా ప్రసవించారు. ఉదయం 10.55 గంటల నుంచి ఒక్క నిమిషం తేడాతో పిల్లలంతా పుట్టారని తెలిపారు. కానీ కాస్త బరువు తక్కువగా ఉండడంతో వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.