సీరియల్ నటి పవిత్ర ఆక్సిడెంట్ లో మరణించాక ఆ భాధ తట్టుకోలేక ప్రియుడు సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి మనకు తెలిసిందే… ఈ నేపథ్యంలో నటుడు చందు భార్య శిల్ప కీలక విషయాలు బయట పెట్టింది. పవిత్ర తో రిలేషన్‌లో ఉంటూ.. తనను, తన పిల్లల్ని వదిలేశాడని చందు భార్య శిల్ప తెలిపింది. అయిదేళ్లుగా నటి పవిత్రతో చందు సహజీవనం చేస్తున్నాడని వెల్లడించింది. చందు స్కూల్‌డేస్ నుంచే తన వెంటపడి మరీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. అప్పటినుంచి తనతో ఎంతో ప్రేమగా ఉండేవాడని.. తన పేరు సైతం తలవని రోజంటూ ఉండేది కాదని పేర్కొంది.