ఖమ్మం జిల్లాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్నారు. వైరా మండలం నారపునేనిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దావులూరి వర్ష (22) బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు 6 నెలల క్రితమే వివాహం జరిగింది. భర్త కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నారు. అనారోగ్య కారణాలతోనే వర్ష ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.