మధ్యప్రదేశ్‌లో అమానుష ఘటన జరిగింది. సొంత బంధువులే ఓ వ్యక్తి పట్ల నీచంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. గుణ జిల్లాలోని మావన్ గ్రామంలో ఓ వ్యక్తి కూలీ పని చేసుకుంటున్నాడు. ఈ నెల 22న కూల్ డ్రింక్స్ తాగుదామని షాప్‌కు తీసుకెళ్లాడు అతని సన్నిహితుడు. అక్కడ మాటువేసిన దాదాపు 12 మంది అతన్ని కిడ్నాప్ చేసి రాజస్థాన్‌కు తీసుకెళ్లారు. దాడి చేసి గుండు కొట్టించారు. మహిళ దుస్తులు తొడిగించి మెడలో చెప్పుల దండ వేశారు. బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటన మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రూ. 25 లక్షలు డిమాండ్ చేయగా పోలీసుల దృష్టికి చేరింది. ఈ తర్వాత మూడు రోజులకు బాధితుడిని వదిలేశారు.