దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర'(Vishwambhara). ఈ సినిమాలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ మూవీతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘విశ్వంభర’ సెట్‌లో హీరో అజిత్ సందడి చేశారు. ఈ విషయాన్ని చిరు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ‘‘‘విశ్వంభర’ సెట్స్‌కి స్టార్‌గెస్ట్‌గా వచ్చి అజిత్ మా అందరినీ ఆశ్చర్యపరిచారు. అజిత్ సినిమా కూడా షూటింగ్ ఇక్కడే జరుగుతుండటంతో చాలా ఏళ్ల తర్వాత కలిశాం’’ అని చెప్పుకొచ్చారు.