Homeహైదరాబాద్latest Newsనాకు అలాంటి పాత్రలంటే చాలా ఇష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కృతిశెట్టి

నాకు అలాంటి పాత్రలంటే చాలా ఇష్టం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ కృతిశెట్టి

హీరోయిన్ కృతిశెట్టి ప్రస్తుతం శర్వానంద్‌తో ‘మనమే’ చిత్రంలో నటించింది. ఈమూవీ జూన్‌ 7న థియేటర్లలో రిలీజ్‌కానుంది. ఈ సందర్భంగా ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను పంచుకుంది. భవిష్యత్తులో ‘బాహుబలి’లోని అనుష్కలాంటి పాత్రలు చేయాలని ఉందని హీరోయిన్ కృతిశెట్టి చెప్పింది. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘రాకుమారి పాత్రలంటే చాలా ఇష్టం. అవకాశం వస్తే యాక్షన్, మార్షల్‌ ఆర్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తాను. నా పాత్ర పరిధి ఎంత అనే విషయం కంటే, అది ఎంత వైవిధ్యంగా ఉందనేదే చూస్తాను. సినిమా సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా’’ అని తెలిపింది. అలాగే ‘మనమే’ సినిమా రొమాంటిక్‌ కామెడీ కథే అయినా బలమైన భావోద్వేగాలు ఉంటాయి. ఇందులో సుభద్ర అనే యువతిగా కనిపిస్తాను. ఈ పాత్ర ప్రయాణం చాలా తృప్తినిచ్చింది. శర్వానంద్‌ అద్భుతమైన నటనని ప్రదర్శించారు’’ అని వివరించింది.

Recent

- Advertisment -spot_img