Homeహైదరాబాద్latest Newsవీడు మామూలోడు కాదు.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.50 కోట్లు టోకరా..!

వీడు మామూలోడు కాదు.. అధిక వడ్డీ ఆశ చూపి రూ.50 కోట్లు టోకరా..!

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక వడ్డీల ఆశ చూపి, సుమారు రూ.50 కోట్లు టోకరా వేసిన ఘటన చోటు చేసుకుంది. తమతో తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలని నిందితుని ఇంటివద్ద బాధితులు అందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పది రూపాయల వడ్డీ ఆశ చూపి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్, రాఘవేంద్ర నగర్ కాలనీలోని చుట్టూ ప్రక్కల కాలనీ వాసుల వద్ద సుమారు రూ.50 కోట్లు భాషెట్టి నాగరాజ్ వసూలు చేసారని తెలిపారు. ఒక్కొక్క వ్యక్తి వద్ద సుమారు రూ.5 లక్షల నుండి రూ.20 లక్షల పైన వసూలు చేసినట్లు తెలిపారు. కొందరి నుండి క్రిడిట్ కార్డ్‌లు తీసుకుని అందులో నుండి డబ్బు చెల్లించుకుని తీరా ఇవ్వాలని అడిగినందుకు మూడు నెలలుగా అందుబాటులో లేడని పేర్కొన్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img