Homeహైదరాబాద్latest NewsVIRAL: ఇద్దరు అమ్మాయిల మధ్య గాఢమైన ప్రేమ.. రహస్యంగా పెళ్లి.. ఆపై తీవ్ర విషాదం..!

VIRAL: ఇద్దరు అమ్మాయిల మధ్య గాఢమైన ప్రేమ.. రహస్యంగా పెళ్లి.. ఆపై తీవ్ర విషాదం..!

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలానికి చెందిన ఓ యువతి (21)కి అదే జిల్లా గార్ల మండలానికి చెందిన యువతి (20)తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం చిగురించి ప్రేమకు దారితీసింది. అది మరింత ముదిరి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఆపై హైదరాబాద్‌ చేరుకుని రహస్యంగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు వారిని విడదీశారు. తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా, మరో యువతి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

Recent

- Advertisment -spot_img