ఇదే నిజం ఆసిఫాబాద్ టౌన్: కొమురం భీం జిల్లా, తిర్యానీ మండలంలోని కన్యక పరమేశ్వరి ఆలయం సమీపంలో, కూన చిన్న పోషయ్య (60) అనే వృద్దుడు చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.