ఇదే నిజం, మందమరి: మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామ పరిధి లో యువకులకు , రామగుండం సిపి ఆదేశాల మేరకు, పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి , వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత,యువత తలుచుకుంటే ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకుని ఉన్నత శిఖరాలను,అధిరోహించవచ్చు అంతటి శక్తి యువతకి ఉంది అన్నారు. క్రీడలు ఆడడంతో శరీరానికి వ్యాయామం అవుతుందని ,విద్యార్థులు యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా ఉదయం వ్యాయామం చేయాలి, ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు.యువకులు, గంజాయి, జూదం వంటి చెడు అలవాట్లకు, ఇతర చెడు మార్గాల వైపు వెళ్లకుండా చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని కోరినారు. మీ గ్రామానికి మంచి గుర్తింపు తీసుకురావాలని, అసాంఘిక శక్తుల గురించి ఎటువంటి సమాచారమైనా పోలీసుల కు అందించాలని ఈ సందర్భంగా సిఐ యువకులకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మందమర్రి సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది గోపాల్ ,విశ్వనాథ్ ,శ్రావణ్ యువత, మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.