బరువు తగ్గాలనే కోరిక ఉన్నా కానీ కొందరూ తినాలనే కోరికను మాత్రం నియంత్రించుకోలేరు. దీంతో శరీరంలో అదనంగా కెలరీలు జమై బరువు పెరుగుతారు.
అసలు అతిగా తినాలనే కోరికలు ఎందుకు వస్తాయి? అలాంటి ఆలోచనలను నియంత్రిచలేమా? దీనికి కొందరు పోషకాహార నిపుణులు సమాధానాలు ఇచ్చారు.
తినాలనే కోరికను మెదడులోని స్ట్రియాటమ్ నియంత్రిస్తుందని తెలిసింది. లెఫిన్, గ్రెలిన్ తదితర హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా తినాలనే కోరికలు ఎక్కువగా కలుగుతాయని అధ్యయనం చెబుతోంది.
బరువు తగ్గాలంటే తొలుత మెదడును ఆధీనంలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి కారణంగా ఎక్కువగా తినాలనే కోరిక పుడుతుంది. ఒత్తిడి బారిన పడకుండా ఉండాలంటే ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలి.
ఆకలికి, దాహానికి చాలా దగ్గరి పోలికలున్నాయట. శరీరంలో నీటి స్థాయిలు తగ్గినప్పుడు కూడా కొన్ని సార్లు మనకు ఆకలిగా అనిపిస్తుందట.
సరిగా నిద్ర పోకపోవడం వల్ల హార్మోన్లలో సమతుల్యత లోపిస్తుంది. వీటిని భర్తీ చేసుకోవడానికి ఎక్కువ ఆహారం తీసుకోవాలని శరీరానికి మెదడు ఆదేశాలిస్తుంది.
మీకు అతిగా తినాలనిపిస్తోందంటే మీ శరీరానికి అవసరమైన ప్రోటీన్లు అందడం లేదని అర్థమట. మాంసం, చేప, గుడ్లు తీసుకోండి. శాకాహారులైతే తమ ఆహారంలో పన్నీరు, డ్రై ఫ్రూట్స్, తృణధాన్యాలు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. దీంతో కనిపించినవన్నీ తినాలనే కోరిక చనిపోతుంది.