ఉత్తరప్రదేశ్ లోని ముజఫుర్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓంప్రకాశ్ అనే వ్యక్తి తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అది కూడా అతడికి తెలియకుండా మత్తుమందు ఇప్పించి అమ్మాయిగా మార్చేశాడు. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో ఓంప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలని బాధితుడి తండ్రి పోలీసులను కోరారు.