సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం తంబాలపురంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను చంపిన రెండ్రోజులకు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం కోసం పింఛన్ డబ్బులు ఇవ్వలేదని భార్యను హతమార్చాడు. అనంతరం రెండు రోజుల తర్వాత సీకేపల్లి వద్ద రైలు కిందపడి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.