బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెబుతూ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీలోని ఏడుగురు ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్ పార్టీలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.