57 రకాల సోర్సుల నుంచి వచ్చే ఆదాయాలను ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది. ఆ సోర్సులు ఏవో తెలుసుకొని, వాటి నుంచి మీకు ఆదాయం వస్తే వెంటనే ఐటీఆర్ ఫైల్ చేయండి. ఆ సోర్సులు ఏవంటే..
- శాలరీ
- అద్దె ఆదాయం
- డివిడెండ్
- సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ
- డిపాజిట్ల నుంచి అందే వడ్డీ
- ఇతరుల నుంచి అందుకున్న వడ్డీ ఆదాయం
- ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్‌పై వడ్డీ
- ప్లాంట్ & మెషినరీ నుంచి వచ్చే రెంట్
- లాటరీ లేదా క్రాస్‌వర్డ్ పజిల్ ఫండ్స్
- గుర్రపు పందేల్లో సంపాదించినది
- ఎంప్లాయర్ నుంచి వచ్చే పీఎఫ్ బ్యాలెన్స్
- ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్స్‌పై వడ్డీ
- నాన్-రెసిడెంట్ కంపెనీ నుంచి వడ్డీ
- బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలపై వడ్డీ
- నాన్-రెసిడెంట్ యూనిట్లకు సంబంధించిన ఆదాయం
- ఆఫ్‌షోర్ ఫండ్ ద్వారా ప్రారంభించిన యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్
- ఇండియన్ కంపెనీలు జారీ చేసిన షేర్లు, ఫారెన్ కరెన్సీ బాండ్లపై ఆదాయం, క్యాపిటల్ గెయిన్
- ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెక్యూరిటీస్‌పై ఆదాయం
- సెక్యూరిటీస్ నుంచి అందే స్పెసిఫైడ్ ఫండ్ అన్కమ్
- ఇన్సూరెన్స్ కమిషన్
- లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ రిసీట్స్
- నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ డిపాజిట్ విత్‌డ్రా
- లాటరీ టిక్కెట్ల అమ్మకంపై కమీషన్ మొదలైనవి
- సెక్యురిటైజేషన్ ట్రస్ట్‌లో పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం
- MF/UTI ద్వారా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసినప్పుడు వచ్చే ఆదాయం
- ప్రభుత్వానికి చెల్లించాల్సిన వడ్డీ లేదా డివిడెండ్ లేదా ఇతర మొత్తాలు
- సీనియర్ సిటిజన్ ఆదాయం
- భూమి లేదా భవనం అమ్మకం
- స్థిరాస్తి బదిలీలు
- వాహనం అమ్మకం
- మ్యూచువల్ ఫండ్ సెక్యూరిటీలు, యూనిట్ల విక్రయం
- ఆఫ్-మార్కెట్ డెబిట్ ట్రాన్సాక్షన్స్
- ఆఫ్-మార్కెట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్
- బిజినెస్ రిసీట్స్
- GST టర్నోవర్
- GST కొనుగోళ్లు
- వ్యాపార ఖర్చులు
- రెంట్ పేమెంట్స్
- ఇతర (Miscellaneous) చెల్లింపులు
- క్యాష్ డిపాజిట్లు
- క్యాష్ విత్‌డ్రా
- క్యాష్ పేమెంట్స్
- అవుట్‌వర్డ్ ఫారెన్ రెమిటెన్స్/విదేశీ కరెన్సీ కొనుగోలు
- ఫారెన్ రెమిటెన్స్ రిసీట్
- నాన్-రెసిడెంట్ స్పోర్ట్స్‌మెన్ లేదా స్పోర్ట్స్ అసోసియేషన్స్‌కు చేసిన పేమెంట్స్
- విదేశీ ప్రయాణం
- స్థిరాస్తి కొనుగోలు
- వాహనం కొనుగోలు
- టైమ్ డిపాజిట్స్ కొనుగోలు
- మ్యూచువల్ ఫండ్స్ సెక్యూరిటీలు, యూనిట్ల కొనుగోలు
- క్రెడిట్/డెబిట్ కార్డ్
- అకౌంట్ బ్యాలెన్స్
- బిజినెస్ ట్రస్ట్ ద్వారా అందే ఆదాయం
- ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ద్వారా పంపిణీ అయిన ఆదాయం
- డొనేషన్స్
- వర్చువల్ డిజిటల్ ఆస్తుల బదిలీలపై ఆదాయం
- ఆన్లైన్ గేమ్స్ విన్ అయినప్పుడు వచ్చే ఆదాయం